హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివగంగ కోనేరులో పడిన కారు

RR: మహేశ్వరం పట్టణంలోని శివగంగ దేవాలయ కోనేరులోకి కారు దూసుకెళ్లింది. కేశంపేట్ నుంచి మహేశ్వరం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం కోనేరులో పడిపోయింది. కారులో డ్రైవర్ ఒక్కడే ఉండగా, డోర్ తెరిచి సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.