హైదరాబాద్: 28°C
తెలంగాణ

మస్కాపూర్‌లో బోనాల పండుగ

NRML: ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో సోమవారం దుర్గామాత బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను తలపైకెత్తుకొని డీజే పాటలు, దప్పుల చప్పుళ్లతో సందడిగా దుర్గా మాత మండపానికి చేరుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.