MDCL: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబీల్‌పూర్ చౌరస్తా సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. పంజాబీ దాబా వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో పూజారి శారద మిశ్రా (49) అక్కడికక్కడే మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన చెట్లగౌరారం పరిధిలోని ఓ పరిశ్రమలో పూజారిగా పనిచేస్తున్నారు. ప్రమాద సమయంలో ఎలక్ట్రిక్ బైక్‌పై వెళ్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో పూజారి మృతి


