హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైల్వే గేటు సాంకేతిక సమస్యతో ఇక్కట్లు

GDWL: ఉండవెల్లి మండలంలోని అలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రైల్వే గేటు వద్ద సాంకేతిక సమస్య తలెత్తింది. ఒక గేటు తెరుచుకోగా, మరో గేటు తెరుచుకోకపోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.