హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఎఫ్ఓకు రెండు తలల పాము అప్పగింత

PDPL: గోదావరిఖని చంద్రబాబు నాయుడు కాలనీలో సోమవారం అరుదైన రెండు తలల పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ పి. శంకర్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న ఆయన చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం పెద్దపల్లి డీఎఫ్‌వో కిష్టగౌడ్, అటవీ అధికారులకు అప్పగించారు. అరుదైన పామును చూసేందుకు జనం ఎగబడ్డారు.