హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గద్వాల మార్కెట్ కిటకిట

GDWL: దసరా పండుగ నేపథ్యంలో గద్వాల పట్టణ మార్కెట్లు జనసందోహంతో కిక్కిరిశాయి. పాతబస్టాండ్, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్, షేరేలివీధిలో వస్త్ర, కిరాణా, పూలు, పండ్ల దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కనిపించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.