హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాల పేరుతో మోసం.. 203 మంది బాధితులు!

NLG: నల్గొండ జిల్లాలో దేవాదాయశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. హుండీ లెక్కింపు ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఫేక్ సమితి ఏర్పాటు చేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్‌కు చెందిన రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నిడమనూరు ఎస్సై తెలిపారు.