హైదరాబాద్: 28°C
తెలంగాణ

7వ రోజుకు చేరిన సమ్మె.. ఒంటికాలిపై నిరసన

KMR: మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. NHM-JAC ఆధ్వర్యంలో ఉద్యోగులంతా ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వైద్యుల వరకు ప్రతిఒక్కరు చాలీచాలని వేతనాలతో కాలం వెల్లదీస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వాపోయారు.