హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 24 డప్పుల పంపిణీ

JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో దసరా సందర్భంగా మద్దనపెల్లి జలంధర్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.25 వేల విలువైన 24 డప్పులను సమకూర్చారు. సర్పంచ్ వెంకట్, ఉపసర్పంచ్ జయ ఆధ్వర్యంలో సోమవారం 24 మంది మాదిగ సంఘ సభ్యులకు వాటిని పంపిణీ చేశారు. డప్పులు అందుకున్న సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు, వీడీసీ, మాదిగ సంఘ సభ్యులు పాల్గొన్నారు.