MNCL: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మందమర్రి కామాఖ్య దేవి దేవాలయంలో సోమవారం మహాచండీ హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ, భక్తిశ్రద్ధలతో మహాచండీ యజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. లోకకళ్యాణార్థం, భక్తుల కోరికల సిద్ధి కొరకు హోమం నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలంగాణ
కామాఖ్య దేవి దేవాలయంలో మహాచండీ హోమం


