హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ పిల్లలతో ఆనందం పంచుకున్న ఛైర్‌పర్సన్

WGL: నర్సంపేట బతుకమ్మ పండుగ సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అనాథ పిల్లలతో ఆనందాన్ని పంచుకున్నారు. సోమవారం పట్టణంలోని ఓ చారిటబుల్ ట్రస్టును సందర్శించి చిన్నారులకు బహుమతులు అందజేశారు. వారితో ముచ్చటిస్తూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనాథ పిల్లలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.