హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

KMR: మద్నూర్(M) పరిధిలోని చిన్నతడుగూరు, ఖరగ్ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం గ్రామస్థులు ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించారు. నూతన గ్రామ పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రత్యేక భవనం నిర్మించాలని, ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.