హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్కు వద్ద ఓపెన్ డ్రైనేజ్ పొంచివున్న ప్రమాదం

NLG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని పంచతత్వ పార్కు మూలమలుపు వద్ద డ్రైనేజీపై మూతలు లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి RTC బస్టాండ్‌కు వెళ్లే వాహనదారులు, పాదచారులు ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీపై మూతలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.