హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవాంఛనీయ ఘటనలకు తావివ్వొద్దు: సీఐ

JN: పాలకుర్తి సర్కిల్ ప్రజలకు సీఐ భారత్ సుమన్ ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మాట్లాడుతూ.. ప్రజలందరూ దసరా పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా పండుగ జరుపుకోవాలని కోరారు.