KMM: వైరా మండలం దాచపురానికి చెందిన రైతు మడుపల్లి వెంకటేశ్వర్లు కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో సాగు చేసిన వరి పంట నీరందక ఎండిపోతోంది. తెలంగాణ సరిహద్దులో చివరి ఆయకట్టు కావడంతో లిఫ్ట్ నీరు అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోతుండటంతో నష్టపోతున్నానని తెలిపారు. అధికారులు స్పందించి చివరి ఆయకట్టు భూములకూ సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
లిఫ్ట్ నీరు అందక రైతుకు కష్టాలు


