హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

MNCL: చెన్నూరు మున్సిపాలిటీ ప్రాంగణంలో రూ. 1 కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక చిరు వ్యాపారుల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు.