హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఘాపూర్ గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

ASF: సిర్పూర్(యు) మండలం రాఘాపూర్ గ్రామంలో సోమవారం ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ విజయలక్ష్మి భీరాసావ్ ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. దోమల బెడద నివారణ కోసం బ్లీచింగ్ పౌడర్ చల్లి, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ సూచించారు.