హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిషాసుర మర్దిని అవతారంలో దుర్గమ్మ దర్శనం

BHPL: భూపాలపల్లి మండలంలోని గొర్లవీడులో గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దుర్గాదేవి మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.