హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ.. మేకలకు భారీ డిమాండ్!

RR: దసరా పండుగ నేపథ్యంలో ఫరూక్‌నగర్ మండలంలో మేకలకు డిమాండ్ పెరిగింది. పండుగ సందర్భంగా మాంసాహార వినియోగం పెరగడంతో కొనుగోలుదారులు మేకల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గ్రామాల్లో ఒక్కో మేక ధర రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది.