హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ సిబ్బందికి దసరా కానుకగా దుస్తుల పంపిణీ

NZB: దసరా పండుగను పురస్కరించుకొని పోచంపాడ్ గ్రామపంచాయతీ సిబ్బందికి సర్పంచ్ మాధురి రాజు, కార్యదర్శి శ్యామ్ ఆధ్వర్యంలో సోమవారం దుస్తులు పంపిణీ చేశారు. పండుగ కానుకగా దుస్తులు అందజేయడంతో సిబ్బంది పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.