హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్ కార్యాలయంలో మూత్రశాలలు ఏర్పాటు చేయాలి: టీఆర్పీ

RR: కొందుర్గు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో మూత్రశాలలు లేక నిత్యం వచ్చే ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస సదుపాయాలు కల్పించి మూత్రశాలలు నిర్మించాలని ప్రజావాణిలో తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దర్గా వెంకటయ్య, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.