NLG: గుడిపల్లి మండలం సౌవుల్లా గూడెం వద్ద రైతు పొలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో గుడిపల్లి, సౌవుల్లా గూడెం గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. మరమ్మతులు చేపడుతున్నట్లు సర్పంచ్ కూన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం వరకు సమస్యను పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొంటూ ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు


