VKB: పెద్దేముల్ మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి మెజారిటీ అధికారులు గైర్హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో వచ్చిన ప్రజలకు అధికారుల గైర్హాజరు నిరాశ కలిగిస్తోందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణికి అధికారులు సక్రమంగా హాజరై, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రజావాణికి అధికారుల గైర్హాజరుపై అసంతృప్తి!


