హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తపల్లిలో పిచ్చికుక్కల స్వైర విహారం

NZB: కొత్తపల్లి గ్రామంలో పిచ్చికుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల్లో ఏడుగురిపై దాడి చేశాయి. దసరా సెలవులు కావడంతో పిల్లలు బయట ఆడుకునేందుకు భయపడుతున్నారు. రాత్రివేళ రోడ్లపై తిరగాలన్నా ప్రజలు జంకుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.