హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో దసరా పూజలు

KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో సోమవారం దసరా సందర్భంగా ఆయుధ, జమ్మి, వాహన పూజలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్ రెడ్డి, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.