హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డుపై వృథాగా ప్రవహిస్తున్న మంచినీరు

HYD: ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నీటిని పొదుపుగా వినియోగించాలని కోరుతూ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు జలమండలి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలు ప్రాంతాలలో మంచినీరు రోడ్డుపై వృథాగా పోతోంది. రాంగోపాల్‌పేట్ డివిజన్ లాలాగుడి ముందు వాటర్ పైప్‌లైన్ లీకై వారం రోజులుగా మంచినీరు వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.