SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ వద్దగల మిడ్ మానేరు రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం ఉదయం 6 గంటలకు 316.31 మీటర్లుగా నమోదైంది. రిజర్వాయర్ పూర్తి నీటిమట్టం 318 మీటర్లు కాగా, ప్రస్తుతం 23.368 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి నిల్వ సామర్థ్యం 27.55 టీఎంసీలు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలిచిపోగా, అవుట్‌ఫ్లో 157 క్యూసెక్కులుగా నమోదైంది.
తెలంగాణ
మిడ్ మానేరు నీటిమట్టం 316.31 మీటర్లు


