హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో ఇంద్రవెల్లి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన MP గోడం నగేశ్

ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను ఆదివాసీ సంఘాల నాయకులు సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 23న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆవిష్కరించనున్న కొమురం భీం కాంస్య విగ్రహ వాల్ పోస్టర్‌ను ఎంపీ నగేశ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఇంద్రవెల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.