హైదరాబాద్: 28°C
తెలంగాణ

బయ్యారంలో కోతుల బెడద.. ప్రజలకు ఇబ్బందులు

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కోతుల గుంపులు సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారు. కోతులు ఒక్కసారిగా మీదకు వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడదను నివారించాలని కోరారు.