కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమతో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సోమవారం సమావేశం అయ్యారు. కృష్ణా జిల్లా ప్రత్యేకతను చాటిచెప్పే పెడన కలంకారీ వస్త్రాన్ని బహూకరించారు. కలంకారీ కళ చారిత్రక ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, మిజోరం రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, పెట్టుబడుల ప్రోత్సాహం ఉన్న అవకాశాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
మిజోరం ముఖ్యమంత్రితో ఎంపీ బాలశౌరి భేటీ


