NRPT: ధన్వాడ మండలం మందిపల్లి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భాజాభజంత్రీల మధ్య ప్రత్యేక బండిపై అమ్మవారి పల్లకి ఊరేగింపు ఘనంగా సాగింది. ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందన్నారు.
తెలంగాణ
VIDEO: మందిపల్లిలో వైభవంగా దుర్గమ్మ పల్లకి సేవ


