నల్గొండ జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో వీధి దీపాలు పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతుండటంతో విద్యుత్ వృథా అవుతోంది. నిరంతర వినియోగంతో బల్బులు త్వరగా పాడై మరమ్మతుల ఖర్చు పెరుగుతోంది. ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు దృష్టి సారించి వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షించాలని, పగటిపూట దీపాలు వెలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
పగలే వెలుగుతున్న వీధి దీపాలు


