హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ ఖాతాలో రజతం..!

NLG: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారిణి, MGU పరిధిలోని డిగ్రీ విద్యార్థిని నారిమళ్ల ప్రవళిక సత్తా చాటింది. జైపూర్ వేదికగా జరిగిన జాతీయ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మహిళల 400 మీటర్ల పరుగులో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 54.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచి ప్రతిభను చాటింది.