హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం: SP

సంగారెడ్డి దుర్గాష్టమి పురస్కరించుకుని జిల్లా పోలీసు ఆయుధాగారం, మోటార్ వెహికల్ సెక్షన్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆయుధ పూజ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ.. అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.