హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిషాసురమర్దినిగా దర్శనమిచ్చిన నవదుర్గ మాత

BHPL: గోరికొత్తపల్లి నవదుర్గ మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం తొమ్మిదవ రోజున అమ్మవారు మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.