BDK: అశ్వాపురంలో బతుకమ్మ పండుగ కోసం తామర పూలు సేకరించేందుకు వెళ్లిన కుర్సం లక్ష్మయ్య (57) చెరువులో మునిగి మృతి చెందాడు. మండల కేంద్రంలోని కాలువ బజార్‌కు చెందిన లక్ష్మయ్య శనివారం భద్రయ్య కుంటకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఆదివారం ఉదయం ఆయన మృతదేహం చెరువులో కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో కాలువ బజార్లో విషాదం నెలకొంది.
తెలంగాణ
చెరువులో మునిగి వ్యక్తి మృతి


