హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళి ఆలయం వద్ద నకిలీ పోలీసు హల్‌చల్‌

WGL: వరంగల్‌ నగరంలోని శ్రీ భద్రకాళి ఆలయం వద్ద సోమవారం ఓ వ్యక్తి పోలీసు టీషర్ట్‌, ఖాకీ ప్యాంటు ధరించి పోలీసు అధికారినంటూ హల్‌చల్‌ చేశాడు. అతడి వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన విధుల్లో ఉన్న పోలీసులు విచారించగా, నకిలీ పోలీసుగా గుర్తించినట్లు సమాచారం. దీంతో మట్టేవాడ పోలీసులకు సమాచారం అందించగా, వారు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.