జగిత్యాల జిల్లా కోరుట్ల వెటర్నరీ విద్యార్థిని లావణ్య నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. గద్వాల జిల్లా తిమ్మాజిపల్లె గ్రామానికి చెందిన ఆమె దసరా సెలవులకు ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా కలుగొట్ల స్టేజి వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కర్నూలు ఆసుపత్రిలో చేర్పించి, అనంతరం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది.
తెలంగాణ
కారు ఢీకొని వెటర్నరీ విద్యార్థి మృతి


