హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల వేళ పోలీసుల పెట్రోలింగ్‌!

E.G: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు సీతానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం పెట్రోలింగ్‌ నిర్వహించినట్లు ఎస్సై ఎల్‌. శ్రీనునాయక్‌ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచామన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని, గొడవలకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.