తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న శ్రీవారిని 76,422 మంది భక్తులు దర్శించుకోగా, 32,141 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తి
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ


