AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అమ్మవారు మహిషాసురమర్ధిని దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో సాధారణంగా నవరాత్రుల ముగింపు రోజైన మహానవమి తిథి నాడు అమ్మవారిని ఈ విశేష రూపంలో అలంకరిస్తారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అవతారమే ఈ మహిషాసురమర్ధిని రూపం.
భక్తి
మహిషాసురమర్ధిని అలంకరణలో దుర్గమ్మ


