హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

AP: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ శ్రీవారికి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి విశేష సమర్పణ ఉంటుంది. అనంతరం శ్రీవారి స్వర్ణరథోత్సవం ముందుకు కదులుతుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రేపటితో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.