హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని మృతి

MBNR: కోరుట్లలో వెటర్నరీ చదువుతున్న లావణ్య (18) దసరాకు ఇంటికి వస్తుండగా ఉండవల్లి(M) కలుగొట్ల స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొంది, ఆదివారం సాయంత్రం మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులో మృతి చెందింది. తండ్రి లేని ఆ కుటుంబంలో ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.