ADB: బేల మండలం సాంగిడి గ్రామంలో లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు రూపేశ్ రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ శాఖ ఎస్ఈ సుబాష్ జాదవ్ కు వినతిపత్రం అందజేశారు. తక్కువ వోల్టేజీతో నీటి మోటర్లు, ఫ్యాన్లు, కూలర్లు పనిచేయడం లేదని వివరించారు. స్పందించిన ఎస్ఈ 15 రోజుల్లో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
తెలంగాణ
'15 రోజుల్లో లోవోల్టేజ్ సమస్య పరిష్కారిస్తాం'


