NRML: నిర్మల్ టీఎన్జీవో భవనంలో ఆదివారం జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు షేక్ రఫీక్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర 6వ మహాసభలు, నవంబర్లో జరగనున్న పాఠశాల విద్యార్థుల చెకుముకి ప్రతిభ పరీక్షలపై చర్చించారు. సమాజంలో మూఢనమ్మకాలను తొలగించి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని తీర్మానించారు.
తెలంగాణ
మూఢనమ్మకాల నిర్మూలనకు జన విజ్ఞాన వేదిక తీర్మానం


