PDPL: రామగుండం కార్పొరేషన్లో ఈ నెల 21న దుర్గామాత నిమజ్జనం సందర్భంగా గోదావరి వద్ద చేపట్టిన ఏర్పాట్లను మేయర్ మహంకాళి స్వామి పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మౌనిక, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, సింగరేణి సివిల్ డీజీఎం వరప్రసాద్ ఉన్నారు.
తెలంగాణ
దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మేయర్


