హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 22 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు ప్రారంభం

BHPL: జిల్లాలో ఈ నెల 22 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతుల సౌకర్యార్థం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిట్యాలలో రెండు, భూపాలపల్లిలో ఒకటి, కాటారం మండలంలో రెండు పత్తి మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టనున్నారు. రైతులు 'కపాస్ కిసాన్' యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.