హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాదె సమ్మయ్యకు ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం

WGL: కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డీన్ ఆచార్య గాదె సమ్మయ్యకు ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రంగంలో విశేష సేవలకుగాను సైంటిఫిక్ లారెల్స్ సంస్థ ప్రతిష్ఠాత్మక బెస్ట్ సైంటిస్ట్ అవార్డును ఆదివారం ప్రకటించింది. ఔషధ పరిశోధన, ఉన్నత విద్య, పరిశోధకులకు మార్గదర్శకత్వం, విద్యా పరిపాలనలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.