హైదరాబాద్: 28°C
తెలంగాణ

పూల శోభతో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు

సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ పెద్ద చెరువు కట్టపై బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంప్రదాయాల నడుమ మహిళల ఆటపాటలు, విద్యుత్ దీపాల కాంతులు, వేల కిలోల పూలతో రూపొందించిన భారీ బతుకమ్మ ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలతో చెరువు కట్ట ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది.