హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 20 నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

దసరా పండుగను పురస్కరించుకుని కల్వకోల్ జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ సహకారంతో యూత్ సభ్యులు ఈ టోర్నీ ఏర్పాటు చేశారు. ఈ నెల 19న డ్రా తీసి, 20 నుంచి 22 వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.